అజారుద్దీన్‌ తనయుడితో సానియా మీర్జా సోదరి వివాహం..

Webdunia
సోమవారం, 7 అక్టోబరు 2019 (12:42 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ తనయుడు అసద్‌‌తో ఆమె వివాహం జరుగనుంది. గత కొంతకాలంగా వీరి వివాహంపై వస్తున్న వార్తలను నిజంచేస్తూ ఆనం, అసద్ వివాహాన్ని ధ్రువీకరించారు. వీరిద్దరి వివాహం ఈ ఏడాది డిసెంబర్‌లో జరుగనుంది. 
 
ఆదివారం రాత్రి ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సానియా ఈ అసద్‌-ఆనంల పెళ్లి విషయాన్ని ప్రస్తవించారు. కాగా మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అక్బర్‌ రషీద్‌ను నిఖా చేసుకున్న ఆనం.. అనంతరం వారి బంధానికి గుడ్‌బై చెప్పారు. ఇటీవల అతని నుంచి విడాకులు కూడా తీసుకున్నారు. 
 
అయితే అతనితో దూరంగా ఉంటున్న సమయంలోనే అసద్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో వారిద్దరికి వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల పెద్దలు దీనిపై చర్చించి.. డిసెంబర్‌లో వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తను చనిపోయినట్లు టీవీలో వస్తున్న వార్తను చూస్తున్న నటుడు ధర్మేంద్ర, ఇంతకన్నా దారుణం ఏముంటుంది?

డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ: అద్భుతమైన బోధకురాలు ఉగ్రవాదిగా ఎలా మారిపోయింది?!

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

తర్వాతి కథనం
Show comments