Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌పై ఆప్ఘన్ విజయం ... పాక్ పాలకులు వక్రబుద్ధి...

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2023 (10:33 IST)
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో ఆప్ఘన్ జట్టు సంచలన విజయాలను నమోదు చేస్తుంది. తొలుత డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. సోమవారం జరిగిన ఆప్ఘనిస్థాన్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఆప్ఘాన్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆప్ఘన్ ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండంటే రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మొత్తం 113 బంతుల్లో 10 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. అవార్డు అందుకున్న జద్రాన్ పాక్ వెనక్కి పంపేస్తున్న ఆఫ్ఘన్ శరణార్థులకు దానిని అంకితమిస్తున్నట్టు పేర్కొన్నాడు. 
 
ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు తిరిగి ఆక్రమించుకున్న తర్వాత లక్షలాదిమంది ఆఫ్ఘన్లు ఇతర దేశాలకు పారిపోయారు. ఈ క్రమంలో ఆశ్రయం కోరుతూ లక్షలాదిమంది పాకిస్థాన్ చేరుకున్నారు. ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ వారిని వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది. నవంబరులోగా దేశాన్ని ఖాళీ చేయాలంటూ గడువు విధించడంతో అక్కడున్న దాదాపు 1.7 మిలియన్ల మంది దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పుడు వీరందరికీ తన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అంకితమిస్తున్నట్టు ప్రకటించి తన దేశభక్తిని జద్రాన్ నిరూపించుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments