Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌పై ఆప్ఘన్ సంచలన విజయం.. కుర్ర స్పిన్నర్ నూర్ అదుర్స్

Afghanistan
, సోమవారం, 23 అక్టోబరు 2023 (23:32 IST)
Afghanistan
వరల్డ్ కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌ జట్టు పాకిస్థాన్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.  వన్డే క్రికెట్లో పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్‌కు ఇదే మొదటి గెలుపు. అంతేకాదు, వన్డేల్లో ఆఫ్ఘన్లకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. ఇవాళ్టి మ్యాచ్‌లో 18 ఏళ్ల ఆఫ్ఘన్ కుర్ర స్పిన్నర్ నూర్ మహ్మద్ ప్రదర్శన మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 
 
వరల్డ్ కప్ 2023లో మొన్నటికి మొన్న ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన ఆప్ఘన్.. ఇవాళ పాకిస్థాన్‌పై నెగ్గా ఔరా అనిపించుకుంది. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో అన్ని విభాగాల్లో రాణించి.. పాక్‌పై ఆప్ఘన్ గెలుపును నమోదు చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. 
 
ఆఫ్ఘన్ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని అందుకుంది. 283 పరుగుల ఛేజింగ్‌లో ఆఫ్ఘన్ టాపార్డర్ పరుగుల వరద పారించింది. 
 
ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ తొలి వికెట్‌కు 130 పరుగులు జోడించారు. రహ్మనుల్లా గుర్బాజ్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 65 పరుగులు చేయగా, మరో ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 113 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 10 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరూ అవుటైన తర్వాత రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.
 
రహ్మత్ షా 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేయగా, షాహిది 45 బంతుల్లో 48 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 1, హసన్ అలీ 1 వికెట్ తీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిగ్గజ స్పిన్నర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ కన్నుమూత