Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమికి కారణాలు ఏంటంటే...

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (11:06 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో వరుసగా భారత్ చేతిలో ఓడిపోతూ వచ్చిన పాకిస్థాన్ జట్టు ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన పూర్తిగా తేలిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైంది. ఫలితంగా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. 
 
ముఖ్యంగా, ఆదిలోనే భారత్ టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగడంతోనే తొలి ప్రభావం పడింది. ఆ తర్వాత ఓపెనర్లుగా బరిలోకి వచ్చిన రోహిత్ శ్రమ (డకౌట్), కేఎల్ రాహుల్‌ (3)లు కేవలం ఆరు పరుగులకే పెవిలియన్‌కు చేరారు. దీంతో మిడిల్ ఆర్డర్‌పై పూర్తి భారం పడింది. 
 
అంచనాలు మించి రాణిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులు చేయగా కెప్టెన్ కోహ్లీకి, పంత్ దన్నుగా నిలిచి స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. అయితే పంత్ అవుట్ అయ్యాక హార్దిక్(11) కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. బ్యాట్‌తో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, కోహ్లీ ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
ఆ తర్వాత బౌలింగ్‌లోనూ భారత్ బౌలర్లు పేలవమైన బౌలింగ్‌తో గల్లీస్థాయి బౌలింగ్‌తో ఆలరించారు. అశ్విన్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగా నాలుగు ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చాడు. తద్వారా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. అశ్విన్ బరిలోకి దిగి ఉంటే.. అతడి అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడేది. 
 
అలాగే, ఏమాత్రం ఫామ్‌లోని భువనేశ్వర్‌ను శార్దూల్ స్థానంలో తీసుకోవడం టీమిండియాకు మైనస్ అయింది. శార్దూల్ ఠాకూర్.. అటు బ్యాట్‌తో ఇటు బంతి‌తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. అతడిని ఎందుకు జట్టులోకి తీసుకోలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ.. సీనియర్ బౌలర్ల అయిన వీరు పూర్తిగా తేలిపోయారు. అసలు మెంటార్‌గా ధోని సలహాలు ఇచ్చాడా.? లేదా మొత్తం కోహ్లీ ప్లానా.? ఏది ఏమైనా నెటిజన్లు మాత్రం ఈ ఓటమితో టీమిండియాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

తర్వాతి కథనం
Show comments