Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు: కోహ్లీ ఇన్నింగ్స్ వృధా.. 135 పరుగుల తేడాతో ఓటమి

దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 135 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో దక్షి

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (18:12 IST)
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 135 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా విధించిన 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. 151 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 
 
రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లో మురళీ విజయ్ 9, లోకేశ్ రాహుల్ 4, పుజారా 19, విరాట్ కోహ్లీ 5, పార్థివ్ పటేల్ 19, హార్దిక్ పాండ్యా 6, రవి చంద్రన్ అశ్విన్ 3, రోహిత్ శర్మ 47, షమీ 28, ఇషాంత్ శర్మ 4 (నాటౌట్), బుమ్రా 2 పరుగులు సాధించారు.  
 
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడీ 6 వికెట్లు తీయగా రబాడా 3 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335, రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేయగా, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 307, రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులు చేసింది. 
 
రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షో చేసినా ఫలితం లేకపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వరుసగా తొమ్మిది టెస్ట్ సిరీస్‌ల గెలుపు తర్వాత పదో టెస్టులో భారత్ ఓడింది. ఇక  ఈ నెల 24న జోహెన్స్‌బర్గ్‌లో మూడో టెస్ట్ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments