సెంచూరియన్ టెస్ట్ : సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్ 335 ఆలౌట్
సొంతగడ్డలోని సెంచూరియన్ పార్కు వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 335 పరుగులకు ఆలౌట్ అయింది. ఆదివారం 269/6 ఓవర్ నైట్ స్కోరు దగ్గర తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగ
సొంతగడ్డలోని సెంచూరియన్ పార్కు వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 335 పరుగులకు ఆలౌట్ అయింది. ఆదివారం 269/6 ఓవర్ నైట్ స్కోరు దగ్గర తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌతాఫ్రికా… మరో 66 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయ్యింది.
మ్యాచ్ ఆరంభంలోనే మహరాజ్(18) వికెట్‌ను కోల్పోయిన సఫారీలు.. ఆతర్వాత 282 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రబడా… ఆ జట్టు కెప్టెన్ డు ప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే 324 పరుగుల దగ్గర రబడా ఎనిమిదో వికెట్‌గా ఇషాంత్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మిగిలిన రెండు వికెట్లు ఎంతో సేపు నిలవలేదు. 333 పరుగుల దగ్గర తొమ్మిదో వికెట్‌గా డుప్లెసిస్(63)… 335 పరుగుల దగ్గర 10 వికెట్‌గా మోర్కెల్(6) వెనుదిరిగారు. భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు తీసుకోగా… ఇషాంత్ 3 వికెట్లు…. షమీ ఒక వికెట్ తీసుకున్నాడు.
ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రాహుల్ తన వ్యక్తిగత స్కోరు పది రన్స్ వద్ద మోర్కెల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పుజారా ఒక్క బంతిని ఎదుర్కొని రనౌట్ అయ్యాడు (డకౌట్). దీంతో 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, మరో ఓపెనర్ విజయ్ (22)తో జత కలిసిన కెప్టెన్ కోహ్లీ ఆచితూచి ఆడుతున్నాడు.