Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి ప్రధాని లేఖ.. ధన్యవాదాలు తెలిపిన మహీ.. ఆర్మీతో కలిసి పనిచేస్తాడా?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (18:51 IST)
Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆగస్టు 15న అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికిన సంగతి తెలిసిందే. దాదాపుగా 16 ఏళ్ల పాటు టీమిండియాకు సేవలు అందించి ఉన్నట్టుండి.. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ స్వస్తి చెప్పడం అందరికీ షాకిచ్చింది. ఈ నేపథ్యంలో సారథిగా అతను భారత్ క్రికెట్‌ను విజయాల తీరాలకు చేర్చిన తీరు అద్భుతం అంటూ పలువురు అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
 
ఇంకా ధోనీ రిటైర్‌మెంట్‌పై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహేంద్ర సింగ్ ధోనీ సేవలను కీర్తిస్తూ లేఖ రాశారు. యువలోకానికి ధోనీ స్పూర్తధాయకమైన నాయకుడాని, గొప్ప మార్గదర్శకుడంటూ మోదీ అభినందించారు. ఫలితం ఏదైనా సమానంగా స్వీకరించే తత్వం ధోనీది అన్నారు. చిరస్థాయిగా అతని పేరు నిలిచిపోతుందంటూ కొనియాడారు.
 
ధోనీ అంటే కేవలం గణాంకాలు, మ్యాచ్ రికార్డ్‌లుగా గుర్తించుకోవడం సమంజసం కాదని మోదీ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ధోనిని కేవలం ఒక క్రీడాకారుడిగా చూడటం తగదన్నారు. తండ్రిగా కూడా జీవాతో ధోనీకి ఉన్న అనుబంధాన్ని మోదీ ప్రస్తావించారు. 
 
నరేంద్ర మోదీ లేఖపై మహేంద్రసింగ్ ధోనీ స్పందిస్తూ..'ఆర్టిస్ట్, సైనికుడు, క్రీడాకారుడు కోరుకునేది ఇలాంటి ప్రశంసలే. ప్రధాని మోదికి ధన్యవాదాలు' అని తెలిపాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పడంతో ఇక ఏటా కొన్ని రోజులు ఆర్మీతో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

తర్వాతి కథనం
Show comments