Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

అయోధ్యలో రామాలయం హిందువుల ఆలయం కాదు అది భారతీయుల ఆలయం: బండి సంజయ్

Advertiesment
Ramalayam
, బుధవారం, 29 జులై 2020 (23:05 IST)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో, భవ్య రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో, గౌరవ ప్రధానిపై అసదుద్దీన్ ఓవైసీ చవకబారు విమర్శలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఆగస్టు 5న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరై, శంకుస్థాపన చేస్తారాన్నరు.
 
దీనిపై హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి అని, అన్ని మతాలను సమానంగా గౌరవించడమే సెక్యులరిజం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆకాంక్ష మేరకు, ప్రధాని రామమందిర శంకుస్థాపనకు వస్తున్నారు. ఈ ఆలయం కేవలం హిందూ మతస్తులకు చెందింది కాదు, ఇది భారతీయుల ఆలయం.
కోట్లాది మంది ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ మహాయజ్ఞ ప్రారంభ కార్యక్రమంలో, ప్రధానిగా శ్రీ నరేంద్రమోదీ గారు పాల్గొనడం, భారతీయులందరికీ గర్వకారణం అన్నారు.
 
400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉంది అనడం, నిజమైతే మరీ అంతకుముందు వేల ఏళ్లుగా అక్కడ ఉన్న శ్రీ రామ మందిరంను మరి ఎవరు ధ్వంసం చేశారు? గౌరవ సుప్రీంకోర్టు తీర్పు తదనంతరం, భారత ప్రభుత్వం కోర్టుకు నివేదించిన మేరకు, ఎటువంటి సమస్యలు లేకుండా, అందరిని కలుపుకుంటూ, ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నది.
 
భారతదేశ ప్రధానిగా, సర్వేజన సుఖినోభవంతు-  సర్వ మానవాళి క్షేమాన్ని కోరుకునే హిందూ మతానికి చెందిన వ్యక్తిగా, శ్రీ నరేంద్రమోదీ గారు, కోట్లాదిమంది ఆకాంక్షలకు అనుగుణంగా, అయోధ్యలో చేపట్టే భవ్య రామమందిర నిర్మాణానికి పునాది వేసే అపూర్వఘట్టంలో పాల్గొనడం చారిత్రాత్మక అవసరం అన్నారు బండి సంజయ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్కు వేసుకున్నాం కదా, కరోనావైరస్ మనల్నేం చేయదని అనుకోకూడదు, ఎందుకంటే?