Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్పూర్‌ను వణికిస్తున్న జికా వైరస్ - 96 యాక్టివ్ కేసులు

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (09:04 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌ను జికా వైరస్ వణికిస్తుంది. ఈ నగరంలో మొత్తం 96 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు ఇక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 123గా వుంది. 
 
కాన్పూర్‌లో మొత్తం 123 కేసులు ఉన్నాయనీ, ఇందులో 96 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ తెలిపారు. మరో మూడు కేసులు లక్నోలో, ఒక కేసు కన్నౌజ్‌లో నమోదైందని తెలిపారు. 
 
అయితే, ఈ వైరస్ ఎలా, ఎవరి వల్ల వ్యాప్తి చెందిందనే విషయాన్ని తెలుసుకుంటున్నామన్నారు. కాన్పూర్‌లో మొదటి జికా వైరస్‌ కేసు అక్టోబర్‌ 23న నమోదైంది. నగరంలో తొలిసారిగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన వారెంట్‌ ఆఫీసర్‌లో వైరస్‌ లక్షణాలను గుర్తించారు. పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్‌ వచ్చింది. 
 
మరోవైపు, ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 నెలల కనిష్టానికి తగ్గిపోయాయి. ఆదివారం 11,271 కేసులు నమోదుకాగా, 285 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
అలాగే, క్రియాశీల కేసుల సంఖ్య కూడా భారీగా దిగివచ్చింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 11 వేలకుపైగా కేసుల్లో దాదాపు సగం అంటే 6 వేలకుపైగా ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. ఆదివారం ఒక్క రోజులోనే 12,55,904 మందికి పరీక్షలు నిర్వహించారు. 
 
తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,63,530కి పెరిగింది. కరోనా మహమ్మారి నుంచి గత 24 గంటల్లో 11,376 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3.38 కోట్లు దాటింది.
 
రికవరీ రేటు అత్యధికంగా 98.26 శాతానికి పెరిగింది. గతేడాది మార్చి తర్వాత రికవరీ రేటు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17 నెలల కనిష్ఠానికి తగ్గింది. ప్రస్తుతం 0.39 శాతం మంది అంటే 1,35,918 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు 112 కోట్ల కరోనా డోసులను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments