దేశంలో కొత్తగా మరో 34 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (10:36 IST)
దేశంలో కొత్తగా మరో 34 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 34,973 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది. ఈ కేసులతో కలుపుకుంటే క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,31,74,954కి చేరింది. 
 
అలాగే, నిన్న 37,681 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 260 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,42,009కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,23,42,299 మంది కోలుకున్నారు. 3,90,646 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. 
 
అదేసమయంలో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 72,37,84,586 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 26,200 కొత్త కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో నిన్న 114 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments