ఏపీలో కొత్తగా 1515 కరోనా కేసులు - 10 మంది మృతి

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (19:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, ఈ కేసుల పెరుగుదలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,515 కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,788కి పెరిగింది. 
 
తాజా కేసులతో పాటు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,09,245కి చేరింది. వీరిలో 19,80,407 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,050 కేసులు యాక్టివ్‌గా వున్నాయి. గత 24 గంటల్లో 68,865 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు.
 
ఇదిలావుంటే, భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 44,658 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. అదేసమయంలో 496 మంది కరోనాతో మృతి చెందారు. 32,988 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.
 
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,26,03,188కి చేరింది. 3,18,21,428 మంది కోలుకోగా, ఇంకా 3,44,899 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 4,36,861కి పెరిగింది.
 
కాగా, దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళలోనే అధికంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. కేరళలో తాజాగా 30,007 పాజిటివ్ కేసులు, 162 మరణాలు నమోదైనట్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments