Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పులు చేసి పారిపోయాడు.. బలవన్మరణానికి పాల్పడిన కుటుంబం

Advertiesment
అప్పులు చేసి పారిపోయాడు.. బలవన్మరణానికి పాల్పడిన కుటుంబం
, గురువారం, 26 ఆగస్టు 2021 (13:03 IST)
అప్పులు చేసిన ఓ యువకుడు ఇంటి నుంచి పారిపోవడంతో అవమానం భరించలేని ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం వారిని కాటికి సాగనమంపేవారు కూడా కరువైన దుస్థితి నెలకొంది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం గ్రామానికి చెందిన శంకరయ్య, గురమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సతీష్, చిన్న కుమారుడు వినయ్ తో కలిసి నివాసముంటున్నారు. 
 
ఐతే సతీష్ గ్రామస్థులు, తెలిసినవారు, బంధువుల వద్ద భారీగా అప్పులు చేశాడు. ఏకంగా రూ.కోటిన్నర అప్పు చేసి వాటిని తీర్చలేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అప్పులిచ్చిన వారు శంకరయ్య ఇంటికి వచ్చి వారిని అసభ్య పదజాలంతో దూషింటడం, శాపనార్ధాలు పెట్టడం, అప్పులు తీర్చమని ఒత్తి చేస్తుండేవారు.
 
కొడుకు చేసిన పనికి ఊళ్లో పరువు పోవడం, అప్పులు తీర్చేదారి కనిపించకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. భార్యభర్తలు, చిన్నకుమారుడు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే ముగ్గురూ చనిపోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
పరారీలో ఉన్న పెద్దకుమారుడు సతీష్ కోసం ఆరా తీస్తున్నారు. అతడు ఎక్కడైనా ఉన్నాడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు సంతోషంగా గడిపిన కుటుంబంలో అప్పులు తెచ్చిన తిప్పలు ముగ్గురు ప్రాణాలను బలిగొన్నాయి. నిన్నటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబం విషాదాంతమవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌రోనా కాలంలో చేనేత కార్మికుల‌కు జ‌గ‌నన్నఅండ‌