Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో జ‌న‌సేన కొత్త ఉద్య‌మం ... రోడ్ల‌పై వీడియోల ప్ర‌ద‌ర్శ‌న‌!

ఏపీలో జ‌న‌సేన కొత్త ఉద్య‌మం ... రోడ్ల‌పై వీడియోల ప్ర‌ద‌ర్శ‌న‌!
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 27 ఆగస్టు 2021 (12:29 IST)
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ఉద్య‌మానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలో అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితిపై వీడియోలు తీసి, వాటిని ప్ర‌ద‌ర్శించి ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి జనసేన రాష్ట్ర నేతలతో ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. రోడ్ల‌పై భవిష్యత్తు  పోరాట కార్యాచరణ పై చర్చ జ‌రిపారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రోడ్ల కోసం జ‌న‌సేన పార్టీ అనే నినాదంతో రోడ్ల పరిశీలన పోస్టర్ ని ఆవిష్కరించిన జనసేన  పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్క‌రించారు. 
 
రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి చూడలేదు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. లక్షా 26వేల కిలో మీటర్లు రాష్ట్ర రహదారులు దెబ్బ తిన్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చలనం లేదు. 12, 450 కోట్ల రూపాయలు రహదారులు బాగు కోసం కేటాయించారు. 1,340 కోట్ల టెండర్లు పిలిచామని గొప్పలు చెప్పుకుంటారు. మరి పనులు  ఎక్కడ, కాంట్రాక్టర్ లు ఏరి? ఇది కూడా పెద్ద స్కాంగా మేం అనుమానిస్తున్నాం. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్నా, గోతుల రోడ్లు కనిపించడం లేదా? వాహన మిత్ర స్కీం పెట్టి, పది వేలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోడ్ల వల్ల వాహనాలు దెబ్బ తిని, మూడింతలు  ఖర్చు అవుతుంది. 3,600కిలో మీటర్లు జగన్ పాదయాత్ర చేశారన్నారు. మరి ఇప్పుడు రోడ్ల దుస్థితి పై ఎందుకు పాదయాత్ర చేయరు? దెబ్బ తిన్న రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత లేదా? అని నాదెండ్ల ప్ర‌శ్నించారు.
 
ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నించకుండా పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని సిఎం వెళుతున్నారు. మా కార్యకర్త ప్లకార్డు చేతబడితే కేసులు పెట్టారు. రోడ్ల పరిస్థితి పై వీడియోలు తీసి మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించార‌ని నాదెండ్ల వెల్ల‌డించారు.
 
సెప్టెంబరు,2,3,4 తేదీలతో ఈ వీడియో లు అందరకీ  ప్రదర్శిస్తాం. ఆ తరువాత ప్రభుత్వం స్పందించాలని  నెల రోజుల పాటు వేచి చూస్తాం. అక్టోబర్ 2వ తేదీ నుండి జనసేన అధ్యక్షుడు నుంచి జన సైనికుల వరకు అందరూ రోడ్లను శ్రమదానంతో బాగు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు వరుసగా ఉంటాయ‌న్నారు. JSP for AP ROADS పేరుతో రోడ్లను పరిశీలించి ప్రజలకు చూపిస్తాం అని చెప్పారు.
 
బిజెపి,  జనసేన కలిసే పని చేస్తాయ‌ని, అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. కానీ, అంతరాలు ఏమీ లేవ‌ని జనసేన  పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రాలు పూజలు.. అబ్బబ్బా మూఢనమ్మకాల గోల.. వ్యక్తి అరెస్ట్