తెలంగాణలో కరోనా వైరస్.. రికార్డు స్థాయిలో 6,542 కేసులు

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (10:43 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీగా కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 20 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది.
 
రాష్ట్రంలో మంగళవారం ఒకే రోజు 1,30,105 పరీక్షలు చేయగా.. 6,542 కేసులు వచ్చాయని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 898, మేడ్చల్‌లో 570, రంగారెడ్డిలో 532, నిజామాబాద్‌లో 427, సంగారెడ్డిలో 320, నల్గొండలో 285, మహబూబ్‌నగర్‌లో 263, వరంగల్‌ అర్బన్‌ 244, జగిత్యాలలో 230, ఖమ్మం జిల్లాలో 246 మంది మహమ్మారి బారినపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,67,901కి చేరగా.. ఇప్పటి వరకు 3,19,537 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 1,876 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments