Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 7,754 కేసులు

Webdunia
శనివారం, 1 మే 2021 (11:09 IST)
తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,754 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి చేరింది. 
 
కొత్తగా 6,542 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 3,62,160 మంది కోలుకున్నారు. మరో 51 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,312కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
 
రాష్ట్రంలో మరణాల రేటు 0.52శాతంగా ఉందని, రికవరీ రేటు 81.68 శాతంగా ఉందని పేర్కొంది. నిన్న ఒకే రోజు రాష్ట్రంలో 77,930 టెస్టులు చేసినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,507 ఉన్నాయి. 
 
ఆ తర్వాత మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 630, రంగారెడ్డిలో 554, సంగారెడ్డిలో 325, కరీంనగర్‌లో 281, మహబూబ్‌నగర్‌లో 279, సిద్దిపేటలో 279, నిజామాబాద్‌లో 267, జగిత్యాలలో 255, సూర్యాపేటలో 242, వికారాబాద్‌లో 242, నల్లగొండలో 231, ఖమ్మంలో 230, మంచిర్యాలలో 216, వరంగల్‌ రూరల్‌లో 208 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

లక్ష రూపాయలు గెలుచుకోండంటూ డియర్ కృష్ణ వినూత్న కాంటెస్ట్

మూడు భాషల్లో ఫుట్ బాల్ ప్రేమికుల కథ డ్యూడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments