Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఒమిక్రాన్ కలకలం - 34 మందికి పాజిటివ్

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (10:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఒమిక్రాన్ కలకలం చెలరేగింది. ఒకేసారి 34 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం వెల్లడించారు. 
 
ఇటీవల ఎట్ రిస్క్ దేశాల నుంచి 12 వేల మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 104 మందికి కరోనా నిర్ధారణ కాగా, 82 మందిలో ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో వీరి శాంపిల్స్‌ను బెంగుళూరుకు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఈ 82 మందిలో 34 మందికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు తేలింది. 
 
దీంతో దేశంలో అత్యధిక సంఖ్యలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు మూడో స్థానానికి చేరుకుంది. అలాగే, చెన్నై, కీల్పాక్కం ఆస్పత్రిలో ఒమిక్రాన్ వైరస్ సోకి చికిత్స పొందుతూ వచ్చిన రోగి పూర్తిగా కోలుకున్నాడు. అయితే, అతన్ని డిశ్చార్జ్ చేసే విషయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాల కోసం ఆస్పత్రి వైద్యులు ఎదురు చూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా 82 మందిలో 34 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అంతేకాకుండా, మిగిలిన వారి ఫలితాలు రావాల్సివుందని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. మరోవైపు, విదేశాల నుంచి చెన్నైకు వచ్చే వారికి ఎయిర్‌పోర్టులోనే రెండు దశల్లో పరీక్షలు నిర్వహించిన తర్వాతే తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనుమతిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments