Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే మహిళకు మూడు డోసుల వ్యాక్సిన్.. నిమిషాల వ్యవధిలో...

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (16:20 IST)
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో వైద్య సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకే మహిళకు కొన్ని నిమిషాల వ్యవధిలో మూడు కరోనా డోసులు వేశారు. మహారాష్ట్రలోని థానే సిటీలో ఆరోగ్య సిబ్బింది ఓ మహిళ(28)కు ఒకే రోజు నిమిషాల తేడాతో మూడు డోసుల వ్యాక్సిన్వేశారు. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థానే మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగిగా ప‌ని చేస్తున్న వ్య‌క్తి భార్య‌కే ఇలా జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. స‌ద‌రు మ‌హిళ జ‌రిగిన ఘ‌ట‌న‌ను త‌న భ‌ర్త‌కు చెప్ప‌గా.. అత‌డు స్థానిక కార్పొరేట‌ర్‌కు ఫిర్యాదు చేశాడు. 

ఈ విష‌యంలో వెలుగులోకి రాగానే థానె మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌.. ఆ మ‌హిళ ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షించ‌డానికి వైద్య బృందాన్ని ఇంటికి పంపించింది. త‌న భ‌ర్త టీఎంసీలో ప‌ని చేస్తాడ‌న్న ఉద్దేశంతో తాను ఫిర్యాదు చేయాల‌ని అనుకోలేద‌ని ఆ మ‌హిళ చెప్పింది. 

త‌న భార్య తొలిసారి వ్యాక్సిన్ వేసుకుంటుండ‌టం వ‌ల్ల ఈ ప్ర‌క్రియ ఎలా ఉంటుందో త‌న‌కు తెలియ‌ద‌ని ఆమె భ‌ర్త చెప్పాడు. ఆమెకు ఆ రోజు జ్వరం వ‌చ్చింద‌ని, అయితే మ‌రుస‌టి రోజు త‌గ్గిపోయి అప్ప‌టి నుంచి బాగానే ఉన్న‌ద‌ని అన్నాడు. ఆమెను ప‌రీక్షించిన వైద్య బృందం కూడా ఆ మ‌హిళ ఆరోగ్యంగానే ఉన్న‌ద‌ని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments