రాజస్థాన్ రాష్ట్రంలో ఓఘటన జరిగింది. 20 లక్షల రూపాయల కరెన్సీని కాల్చివేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించడానికి అతని నుంచి తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ రూ.20 లక్షల నగదు తీసుకున్నారు.
ఈ నగదు తాహసీల్దారు కార్యాలయంలో పని చేసే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పర్వత్ సింగ్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆ తర్వాత సింగ్‌తోపాటు ఏసీబీ అధికారులు జైన్ నివాసానికి చేరుకున్నారు. దీన్ని గమనించిన జైన్ అన్ని తలుపులకు తాళాలు వేసి కరెన్సీ నోట్లను కాల్చివేశాడని అధికారులు చెప్పారు.