Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెలలో కోవిడ్ వ్యాక్సిన్‌? భారత్ నుంచి కాదు.... మరి ఎక్కడ నుంచి?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (18:23 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాల నిమగ్నమైవున్నాయి. ఇందులోభాగంగా, కోవిడ్ వ్యాక్సిన్‌ కనుగొనేందుకు విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యాకు చెందిన గమాలెయ్ ఇని‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారీలో తాము ఎంతో పురోగతి సాధించినట్టు ప్రకటించింది. 
 
ఇప్పటికే సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, వలంటీర్లకు వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చామని అంటోంది. ఇగే అంశంపై గమాలెయ్ సంస్థ డైరెక్టర్ అలెగ్జాండర్ మాట్లాడుతూ, తమ వ్యాక్సిన్ ఆగస్టు 14 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని, సెప్టెంబరు నుంచి ఫార్మా కంపెనీల్లో భారీగా ఉత్పత్పి ప్రారంభం అవుతుందని తెలిపారు. 
 
అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పరిశోధనలను సమన్వయం చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం చూస్తే, రష్యా వ్యాక్సిన్ ఇంకా క్లినికల్స్ ట్రయల్స్‌లో మొదటి దశ (ఫేజ్-1)లోనే ఉందని తెలుస్తోంది. 
 
ఏ వ్యాక్సిన్ అయినా భారీస్థాయిలో ఉత్పత్తికి అనుమతి పొందాలంటూ అది మానవులపై క్లినికల్ ట్రయల్స్‌లో మూడు దశలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే రష్యా వ్యాక్సిన్ అన్ని దశలు పూర్తి చేసేందుకు మరింత సమయం పడుతుందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు, అటు అమెరికా, ఇటు భారత్‌లోనూ కరోనా వ్యాక్సిన్‌ కోసం ముమ్మరంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ రెండు దేశాల్లో వివిధ ఫార్మా కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే శుభవార్త చెబుతాం అంటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తే, ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ తీసుకొస్తామని భారత్ వైద్య పరిశోధనా సంస్థ ఐసీఎంఆర్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments