Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 మ్యుటేషన్లతో ఓమిక్రాన్, డేంజరస్: ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (22:18 IST)
ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురిచేసే కొత్త వేరియంట్‌పై వ్యాఖ్యానిస్తూ... స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో ఓమిక్రాన్ 30కి పైగా మ్యూటేషన్లను కలిగి ఉన్నట్లు చెప్పారు. స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలోని వేరియంట్లు రోగనిరోధక తప్పించుకునే యంత్రాంగాన్ని కలిగి వున్నాయనీ, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు.

 
స్పైక్ ప్రొటీన్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను రూపొందించడం ద్వారా చాలా వ్యాక్సిన్‌లు పనిచేస్తాయి. కాబట్టి కోవిడ్‌కు వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని టీకాలను సమీక్షించవలసి ఉంటుంది. ఓమిక్రాన్ స్పైక్ ప్రొటీన్‌లో అనేక మ్యుటేషన్లు కలిగి ఉన్నందున, ఇది చాలా వ్యాక్సిన్‌లను తేలికగా అధిగమించే అవకాశం లేకపోలేదని అనుమానం వ్యక్తం చేసారు.

 
"కరోనావైరస్ యొక్క కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో 30 కంటే ఎక్కువ మ్యుటేషన్లను పొందింది. అందువల్ల రోగనిరోధక ఎస్కేప్ మెకానిజమ్‌లను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా చాలా వ్యాక్సిన్‌లు పనిచేస్తున్నాయి, స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో చాలా మ్యుటేషన్లు కోవిడ్ వ్యాక్సిన్‌ల సామర్థ్యాన్ని తగ్గించడానికి దారితీయవచ్చు, అని గులేరియా చెప్పారు.

 
కొత్త వేరియంట్ మొదట దక్షిణాఫ్రికాలో ఈ నెల 24న వెలుగుచూసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఆందోళన కలిగించే వేరియంట్‌గా గుర్తించింది. ఈ వేరియంట్ ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియాతో సహా అనేక ఇతర దేశాలలో వ్యాపించింది. ఐతే ఇప్పటి వరకు భారత్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అలాగని నిర్లక్ష్యం కూడదనీ, ప్రతి ఒక్కరూ మాస్క్, భౌతిక దూరం పాటించాలన్నారు. టీకాలు వేయించుకోని వారు సత్వరమే టీకాలు వేయించకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments