ఆఫ్రికా దేశాల్లో కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ తీవ్ర చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో బి.1.1.529గా గుర్తించిన కరోనా వేరియంట్‌కు ఒమిక్రాన్‌గా నామకరణం చేశారు. దీని ప్రభావం ఆఫ్రికా దేశాల్లో అధికంగా ఉంది.
దీంతో జింబాబ్వేలో జరగాల్సిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు వాయిదాపడ్డాయి. కరోనా భయంతోనే ఈ మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది.
2021 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో భాగంగానే ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లను జింబాబ్వేలో నిర్వహించాల్సి వుంది. అయితే, కరోనా రిస్క్ అధికంగా ఉండటంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది.