Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ కేసులు.. భారత్‌లో లాక్‌డౌన్ తప్పదా?

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (20:37 IST)
ఒమిక్రాన్ కేసులు భారత్‌లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. మొదట కరోనా ఫస్ట్‌ వేవ్‌ వ్యాప్తి చెందినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 3 నెలల పాటు లాక్‌డౌన్‌ విధించాయి. ఆ తర్వాత డెల్టా వేరియంట్ రూపంలో 3రెట్ల వేగంతో మరోసారి కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో మరోమారు లాక్‌డౌన్‌కు విధించక తప్పలేదు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ డెల్టా వేరియంట్ కంటే 6రెట్ల వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) వెల్లడించింది.

 
 
ఈ నేపథ్యంలో మరోసారి భారత్‌లో లాక్‌డౌన్‌ తప్పదా..? అనే ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో మెదులుతోంది. ఇప్పటికే కర్ణాటకలోని బెంగూళూరు ఎయిర్‌పోర్టుకు నవంబర్‌ 11న ఒకరు, నవంబర్‌ 20 మరొకరు ఒమిక్రాన్‌ సోకిన దేశాల నుంచి వచ్చారు. 

 
అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యలు కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని ఐసోలేషన్‌లో పెట్టి జినోమ్‌ సీక్వెన్సికి పంపించారు. జినోమ్‌ ఫలితాల్లో ఒమిక్రాన్‌గా తేలడంతో భారత్‌లో మరోసారి టెన్షన్‌ మొదలైంది. 

 
ఒమిక్రాన్‌ సోకిన వారి కాంటాక్ట్‌ లిస్టును కూడా ట్రేస్‌ చేసి ప్రస్తుతం వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు ఒమిక్రాన్‌ సోకిన దేశాల్లో ఒకటైన బ్రిటన్‌ నుంచి తెలంగాణకు వచ్చిన మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జినోమ్‌ సీక్వెన్సీకి ఆమె శాంపిల్స్‌ను వైద్యులు పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments