మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా... 24 గంటల్లో 131 మంది ఖాకీలకు సోకింది...

Webdunia
గురువారం, 28 మే 2020 (17:09 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. తాను మరింతగా వ్యాప్తి చెందకుండా అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసులను సైతం వదిలిపెట్టడం లేదు. ఫలితంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోలీసులు ఈ వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా, మహారాష్ట్రలో అయితే, ఇప్పటివరకు ఏకంగా 2095 మంది ఈ వైరస్ బారినపడ్డారు. గత 24 గంటల్లో 131 మంది పోలీసులకు ఈ వైరస్ సోకింది. 
 
వాస్తవానికి మహారాష్ట్రను కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెల్సిందే. అదేసమయంలో పోలీస్ శాఖలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతున్నాయి. గత 24 గంటల్లో 131 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇద్దరు పోలీసులు కొవిడ్‌-19తో మృతి చెందారు. ఇప్పటి వరకు 2095 మంది పోలీసులకు కరోనా సోకింది. మృతుల సంఖ్య 22కు చేరింది. 897 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 56,948 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,897 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ నుంచి 17,918 మంది కోలుకున్నారు. రెండో స్థానంలో తమిళనాడు(18,545 పాజిటివ్‌ కేసులు), మూడో స్థానంలో ఢిల్లీ(15,257 పాజిటివ్‌ కేసులు) ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments