పెళ్లికొడుకుతో పాటు 9మందికి కరోనా.. పెళ్లికూతురికి మాత్రం నెగటివ్..

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (12:31 IST)
వివాహ వేడుకలకు పరిమితంగా సభ్యులు హాజరు కావాలని నిబంధలున్నప్పటికీ.. జనాలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. అలాగే చాలా ఫంక్షన్లలో కరోనాకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. దీని ఫలితంగా ప్రజలు కరోనా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో ఒకే ఇంట్లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఇద్దరు పెద్దలు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్టుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మమత వెల్లడించారు. దీంతో... అందరినీ హోం ఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 
 
ఇలా 9 మందికి కరోనా సోకడానికి కారణం వారి ఇంట జరిగిన వివాహమేనని తేలింది. ఇటీవలే ఈ ఇంట్లో వివాహం జరిగింది. అయితే, కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో.. టెస్ట్ చేయించుకున్నారు. పెళ్లి కుమారుడు సహా ఆ కుటుంబంలోని ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. పెళ్లి కూతురికి మాత్రం నెగిటివ్‌గా వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ ను అభినందించిన విజయ్ దేవరకొండ

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్‌ టీజ‌ర్

Niharika Konidela: రాకాస గ్లింప్స్‌లో కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సంగీత్ శోభన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments