Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా కేసులకు బ్రేక్ పడినట్టేనా? 12 గంటల్లో ఒక్క కేసు..

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (12:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టపడినట్టేనా? ఎందుకంటే గత 12 గంటల్లో ఒకే ఒక్క కేసు నమోదైంది. అదీ కూడా గుంటూరు జిల్లాలో. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొండంత ఊటనిచ్చే వార్తగా చెప్పుకోవచ్చు. 
 
తబ్లీగి జమాత్ మత సమ్మేళనానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 11 కరోనా కేసులు మాత్రమే వుండే. ఈ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం 303 కేసులు ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఈ కేసులు విపరీతంగా నమోదయ్యాయి. 
 
అదేసమయంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను డేంజర్ ఏరియాలుగా ప్రకటించి, లాక్‌డౌన్‌ నిబంధనలను పక్కాగా అమలు చేశారు. ఫలితంగా గడిచిన 12 గంటల సమయంలో ఏపీలో ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. ఇది కొంతవరకు ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. గుంటూరు నగరంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో మొత్తం ఏపీలో 304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
మంగళవాం నమోదైన పాజిటివ్ కేసుతో కలిపి గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య 33కు చేరింది. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు జరిపిన పరీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే రావడం కొంత ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments