Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఏడాదిన్నర బాలుడికి షిగెల్లా..

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (18:59 IST)
Shigella
కేరళను ఓ వైపు కరోనా వైరస్‌, మరోవైపు షిగెల్లా బ్యాక్టీరియా వణికిస్తున్నాయి. తాజాగా గురువారం ఏడాదిన్నర ఏళ్ల బాలుడికి షిగెల్లా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కోజికోడ్ నగర పరిధిలోని ఫిరోక్ ప్రాంతానికి చెందిన బాలుడికి చాలా రోజులుగా విరేచనాలు అవుతున్నాయి. దీంతో పరీక్షలు నిర్వహించగా షిగెల్లా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాబు పరిస్థితి బాగానే ఉన్నదని వైద్యులు తెలిపారు.
 
బాలుడి తల్లిదండ్రుల నుంచి కూడా నమూనాలు సేకరించి పరీక్షకు పంపినట్లు చెప్పారు. గత వారం కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి బారిన పడి 11 ఏళ్ల బాలుడు మరణించడంతో పాటు మరో 30మందికి సోకడంతో కేరళలో కలకలం రేగింది.
 
అయితే షిగెల్లా బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధి గురించి భయాందోళన అవసరం లేదని, ఈ వ్యాధి వ్యాప్తి మూలాలను గుర్తించేందుకు వైద్య నిఫుణులు ప్రయత్నిస్తున్నారని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ చెప్పారు. 
 
కలుషిత నీటి వల్ల షిగెల్లా బ్యాక్టీరియా సోకినట్లుగా ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తుందని వెల్లడించారు. వ్యాధి సోకిన వారి ఇండ్ల నుంచి సేకరించిన నీటి, ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కాచి వడకట్టిన నీటిని తాగాలని ప్రజలకు ఆమె సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments