Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రికి కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోయిన జార్ఖండ్ సీఎం

Webdunia
బుధవారం, 8 జులై 2020 (16:18 IST)
Jharkhand CM
కరోనా దెబ్బకి భారతదేశం విలవిల్లాడిపోతోంది. చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది. ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా కరోనా సోకింది. తాజాగా జార్ఖండ్ రాష్ట్ర మంత్రి మిథిలేష్ ఠాకూర్‌కు మంగళవారం నాడు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఇటీవలే ఆ మంత్రి సీఎంతో సమావేశం జరిగిన నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. 
 
అయితే ముఖ్యమంత్రికి ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్ళినట్లు అధికారులు తెలియజేశారు. సీఎంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, కార్యాలయంలోని సిబ్బందిని హోం క్వారంటైన్ లోనే ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీఎం కార్యాలయంలోకి వచ్చే విజిటర్స్ పై కూడా అనేక నిబంధనలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 3056 కేసులు పాజిటివ్‌గా నమోదవగా అందులో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments