దేశంలో 543 రోజుల కనిష్టానికి కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (11:53 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. ఇందులోభాగంగా, తాజాగా 543 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 8774 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,72,523కి చేరింది. 
 
ఇందులో 3,39,98,278 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,05,691 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో మొత్తం 8774 పాజిటిప్ కేసులు నమోదు కాగా, 9481 మంది ఈ వైస్ బారి నుంచి కోలుకున్నారు. అలాగే, 543 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
మరోవైపు, దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో సగానికిపైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో శనివారం ఏకంగా 4741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల రికవరీ రేటు 98.34 శాతంగావుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments