Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

నేడు రాజ్యాంగ దినోత్సవం, అసెంబ్లీ కమిటీ హాల్లో వేడుకలు

Advertiesment
national
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 26 నవంబరు 2021 (15:03 IST)
భారత దేశానికి సర్వోత్కృష్ఠమైన‌ చట్టం భారత రాజ్యాంగం. దీని ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, సమాచార వ్యవస్థ ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా రాజ్యాంగం నిర్దేశిస్తోంది. 
 
 
భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. అవతారిక, 448 అధికరణాలు, 12 షెడ్యూళ్ళతో కూడిన గ్రంథం ఇది. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించింది. 26 నవంబర్, 1949లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజుకు గుర్తుగా, నేడు రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం 1950 జనవరి, 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

 
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. అసెంబ్లీ హాలులో  స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్, శాసనమండలి చైర్మన్  మోషన్ రాజు త‌దిత‌రులు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన‌ని జ‌రుపుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ అసెంబ్లీలో స‌భ్యులు... ఇక‌పై సెల్ ఫోన్ లోనికి తేకూడ‌దట‌!