Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల తాజా గణాంకాలు...

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (11:03 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో 16,505 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేస‌మ‌యంలో 19,557 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,03,40,470కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 214 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,49,649కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,46,867 మంది కోలుకున్నారు. 2,43,953 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,56,35,761 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఆదివారం 7,35,978 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 238 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 518 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,740కి  చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,81,083 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,551కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 5,106 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,942 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 60  కరోనా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments