Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత జట్టుకు గాబ్బా భయం.. అందుకే మొండికేస్తోంది : బ్రాడ్ హాడిన్

భారత జట్టుకు గాబ్బా భయం.. అందుకే మొండికేస్తోంది : బ్రాడ్ హాడిన్
, సోమవారం, 4 జనవరి 2021 (09:02 IST)
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఇప్పటికే వన్డే, ట్వంటీ20 సిరీస్ ముగియగా, నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ముగిశాయి. మూడో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగాను, నాలుగో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్‌లోని గాబా క్రికెట్ మైదానంలో జరగాల్సివుంది. 
 
అయితే, బ్రిస్బేన్‌లో కఠినమైన కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిబంధనలు పాటిస్తేనే ఇక్కడకు రావాలని స్థానిక యంత్రాంగం భారత క్రికెట్ జట్టును సూచన చేసింది. అంటే.. స్థానిక యంత్రాంగం ఆదేశాల మేరకు మరోమారు భారత క్రికెటర్లు క్వారంటైన్‌లో గడపాల్సివుంది. దీనికి భారత క్రికెటర్లు ససేమిరా అంటున్నారు. తమకు కరోనా నిబంధనలు సడలించాలని కోరుతోంది. 
 
భారత జట్టు అభ్యర్థనపై క్వీన్స్‌లాండ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ షాడో మంత్రి రాస్ బేట్స్ తీవ్రంగా స్పందించారు. ఇక్కడకు రావాలంటే ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందుకు అంగీకరిస్తేనే రావాలని, లేకపోతే వద్దని స్పష్టం చేశారు. మరోవైపు, ఆ రాష్ట్ర క్రీడాశాఖ షాడో మంత్రి టిమ్ మాండెర్ కూడా ఇలానే స్పందించారు. ఇక్కడ నిబంధనలు అందరి కోసమని, వాటిని పాటించకుండా రానవసరం లేదని స్పష్టం చేశారు.
 
ఈ పరిణామాలపై ఆసీస్ మాజీ కీపర్ బ్రాడ్ హాడిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకు ఘనమైన రికార్డు ఉందని, అక్కడ ఆ జట్టుపై గెలిచిన వారెవరూ లేరని అన్నాడు. ఈ విషయం తెలిసే భారత జట్టు అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని ఆరోపించాడు. ఇందుకోసం కుంటి సాకులు చెబుతోందని విమర్శించాడు.
 
సిడ్నీలో కరోనా కేసులు వెలుగు చూడడంతో దానితో ఉన్న సరిహద్దును క్వీన్స్‌లాండ్ మూసేసింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్తే కనుక తాము హోటల్ గదులకు పరిమితం కావాల్సి ఉంటుందని, కాబట్టి ఆంక్షలు సడలిస్తే తప్ప తాము బ్రిస్బేన్ వెళ్లేది లేదని భారత జట్టు తేల్చి చెప్పింది. లేదంటే, నాలుగో టెస్టును కూడా మూడో టెస్టు జరగనున్న సిడ్నీలో నిర్వహించాలని టీమిండియా పట్టుబడుతోంది. 
 
క్వీన్స్‌లాండ్‌లో ఒక్క కేసూ లేదని, అలాంటప్పుడు టెస్టు మ్యాచ్‌ను మరో వేదికకు తరలించడం సాధ్యం కాదన్నాడు. నిజానికి ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోందో తెలిసే భారత ఆటగాళ్లు ఇక్కడ అడుగుపెట్టారని, అక్కడ ఆంక్షలు ఉంటాయని వారికి తెలుసని అన్నాడు. ఇలాంటి ఫిర్యాదులను తామెప్పుడూ వినలేదని అన్నాడు. నా వరకు చెప్పాలంటే భారత జట్టు గబ్బాలో ఆడేందుకు ఇష్టపడడం లేదని చెబుతానని వివరించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఫ్ - పందిమాంసం వంటకాలు లాగించిన రోహిత్ శర్మ.. సరికొత్త వివాదం!