Webdunia - Bharat's app for daily news and videos

Install App

COVID-19: 24 గంటల్లో 200,000 కంటే ఎక్కువ కేసులు

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (18:27 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో 200,000 కంటే ఎక్కువ కేసులు నమోదైనాయి. COVID-19 కేసులు దేశంలో గణనీయంగా పెరుగుతున్నాయి. గురువారం 1,000 మందికి పైగా మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలు అరకొరగా వున్నాయనే ఆందోళనల మధ్య, ప్రభుత్వ ప్యానెల్ దేశంలో తగినంత వైద్య ఆక్సిజన్ సరఫరా ఉందని ప్రజలకు హామీ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
 
అలాగే దేశంలోని 10 రాష్ట్రాలలో డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. డబుల్ మ్యూటెంట్ వైరస్‌తో విస్తృతంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. గతంలో కరోనా వైరస్ వచ్చి తగ్గిన వారిలో మరోసారి కరోనా పాజిటివ్ వస్తోంది. 
 
డబుల్ మ్యూటెంట్ వైరస్‌తో 18 నుండి 45 సంవత్సరాలలోపు వారిలో మరణాల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ఉత్పరివర్తన జాతులు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది.
 
కోవిడ్-19 కేసులు వేగంగా పెరగడంలో ఈ మార్పుచెందిన వైరస్ కలిగిన వారు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్య వర్గాలు అంటున్నాయి. ఢిల్లీలో యూకే స్ట్రెయిన్, డబుల్ మ్యూటేషన్లతో కూడిన జాతులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments