పాకిస్థాన్ గనక మరీ రెచ్చిపోయి హింసకు దిగితే భారత్ సైనిక చర్య ద్వారానే గట్టి జవాబు ఇస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో పేర్కొంది.
''గతంలో కంటే భారత్ వైఖరి మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం చర్చలు, రాయబారాల కంటే సైనిక చర్యకే మొగ్గు చూపే అవకాశం ఉంది. రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. కాశ్మీర్లో అశాంతి వల్ల గానీ, ఏదేనా ఉగ్రదాడి వల్ల గానీ ఉద్రిక్తతలు పెరిగి అది రెండు దేశాల మధ్య ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది'' అని ఆ నివేదిక వివరించింది.
భారత్, పాక్‌ల మధ్య పరస్పర ఆరోపణలు మరింత పెరిగే అవకాశమున్నప్పటికీ.. ప్రత్యక్ష యుద్ధానికి ఆస్కారం లేదని ఆ నివేదిక తేల్చిచెప్పింది. కశ్మీర్లో అస్థిరత, భారత్‌లో ఉగ్రదాడుల వంటి చర్యలతో అణ్వాయుధ దేశాలైన ఈ రెండింటి మధ్య ఘర్షణాత్మక వాతావరణం మరింత పెరిగే ప్రమాదముందని పేర్కొంది.