Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు చెక్.. భారత్ ముందడుగు.. హోమియోపతి నుంచి వ్యాక్సిన్

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (09:56 IST)
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కరోనాను నియంత్రించేందుకు అల్లోపతి వ్యాక్సినేషన్లు వినియోగానికి వచ్చిన తరుణంలో.. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్ మరో ముందడుగు వేసింది. హోమియోపతి వ్యాక్సిన్‌తో కరోనాను తరిమేందుకు సిద్ధమైంది. ప్రపంచంలో ఏ దేశం కూడా కరోనా కట్టడికి హోమియో వ్యాక్సిన్ వాడలేదు. భారత్ మాత్రం హోమియో టీకా ఇచ్చేందుకు సిద్దమవుతుంది.  
 
దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. కాగా ఈ వ్యాక్సిన్ ని లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా కంపెనీ తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ 62 శాతం ప్రభావం చూపుతుందని ఆ సంస్థ అధిపతి డాక్టర్ రాజేష్ తెలిపారు.
 
వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో తాము తయారు చేసిన సోనోడ్ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మనిషిలో సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతూ, వ్యాధిలక్షలను తగ్గించేది టీకా అని, సోనోడ్ కూడా టీకానే అని అంటున్నారు తయారీదారులు.
 
క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని హోమియో నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత్ లో రెండు టీకాలను ఇస్తున్నారు. తాజాగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు అనుమతులు లభించాయి. దీనికి సోనోడ్ కూడా తోడైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగుతుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments