రియల్ మీ వినియోగదారులకు గుడ్ న్యూస్. రియల్ మీ 8 సీరిస్‌లో 5జీ ఫోన్లు త్వరలో ఆవిష్కృతం కానున్నాయి. రియల్ మీ 8, రియల్ మీ 8 ప్రో ఫోన్లు మనదేశంలో ఏప్రిల్ 22న ప్రారంభం కానుండగా, ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు మొదట మలేషియాలో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 21న మలేషియాలో, ఏప్రిల్ 22న ఇండియాలో రిలీజ్ కానున్నాయి.
రియల్ మీ 8 5జీలో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్ తోపాటు డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉండనుంది. ప్రైమరీ కెమెరా సెటప్ లో 48 మెగాపిక్సెల్ తో ఉన్న మూడు కెమెరాల సెటప్ రానుంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ తో అందించనున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ కానున్న మొదటి ఫోన్ ఇదేనని పేర్కొంది.
రియల్ మీ 8 5జీలో 8 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 తో పనిచేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లుగానూ, బరువు 185 గ్రాములుగానూ ఉంది. 5జీ, వైఫై, జీపీఎస్, గ్లోనాస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఫీచర్స్ సంగతికి వస్తే...
6.5 ఎల్సీడీ 90హెచ్ డిస్‌ప్లే,
600 నిట్స్ బ్రైట్ నెస్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
డైమన్సిటీ 700
185 గ్రాముల బరువు, 8.5ఎంఎంల మందం
128 జీబీ ధర రూ.17,860గా పలుకుతోంది.