Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూన్‌ 14న ఎల్‌శాక్‌ ఆధ్వర్యంలో ఎల్‌శాట్‌- ఇండియా 2021 నిర్వహణ

జూన్‌ 14న ఎల్‌శాక్‌ ఆధ్వర్యంలో ఎల్‌శాట్‌- ఇండియా 2021 నిర్వహణ
, గురువారం, 15 ఏప్రియల్ 2021 (21:02 IST)
లా స్కూల్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌ (ఎల్‌శాక్‌) నేడు ఎల్‌శాట్‌ 2021ను జూన్‌ 14తో ఆరంభమయ్యే వారంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మరోమారు నిరూపిత ఆన్‌లైన్‌ టెస్ట్‌ డెలివరీ వ్యవస్థ ఇది వినియోగించుకుంటుంది. ఇది కృత్రిమ మేథస్సు సహాయ రిమోట్‌ ప్రోక్టారింగ్‌ వినియోగించడంతో పాటుగా పరీక్ష యొక్క సమగ్రత, ప్రామాణికతను భద్రపరచడానికి ఎల్‌శాట్‌ ఇండియా పరీక్షను పలు రోజుల పాటు నిర్ధేశిత టైమ్‌ స్లాట్స్‌లో నిర్వహిస్తారు. దీనివల్ల ఎక్కువ మంది ఈ పరీక్షలలో పాల్గొనేందుకు అవకాశమూ కలుగుతుంది. రిజిస్ట్రేషన్‌లకు ఆఖరు తేదీ 04 జూన్‌ 2021.
 
విద్యార్థులు ఎల్‌శాట్‌ ఇండియా 2021 కోసం discoverlaw.in/register-for-the-test ను సందర్శించి తమ పేర్లను నమోదుచేసుకోవచ్చు. ఒకసారి రిజిస్ట్రేషన్‌ కాలపరిమితి ముగిసిన తరువాత, అభ్యర్థులు షెడ్యూలింగ్‌ వివరాలు, ఆన్‌లైన్‌ పరీక్షలో హాజరయ్యే విధానం తెలుపుతూ మార్గదర్శకాలు వెలువడతాయి. 
 
ఎల్‌శాట్‌- ఇండియాను భారతదేశంలో అగ్రశ్రేణి లా కాలేజీలు తమ లా ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షగా వినియోగించుకుంటున్నాయి. ఎల్‌శాట్‌ ఇండియాలో పాల్గొన్న విద్యార్థులు భారతదేశంలో అగ్రశ్రేణి న్యాయ కళాశాలలో  దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కళాశాలల వివరాలను discoverlaw.in/associated-law-college వద్ద తెలుసుకోవచ్చు.
 
ఈ పరీక్ష కోసం విద్యార్థులు సిద్ధమయ్యేందుకు సహాయపడుతూ ఎల్‌శాట్‌ ఈ సంవత్సరారంభంలో ఎల్‌శాక్‌ లాప్రిప్‌ను ఆవిష్కరించింది. దీనిలో విస్తృతశ్రేణి లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. ఎల్‌శాట్‌ ఇండియా పరీక్ష అనుభవంను ఇది విద్యార్థులకు అందించడంతో పాటుగా డిజిటల్‌ పరీక్ష విధానం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. ఎల్‌శాక్‌ లాప్రిప్‌ గురించి మరింత సమాచారం కోసం discoverlaw.in/lsac-lawprep చూడవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా ఉధృతి.. నీట్‌, పీజీ మెడికల్‌ పరీక్షలు వాయిదా