Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగులకు కొత్త సమస్య - రాలిపోతున్న జట్టు.. హెర్పిస్ ఇన్ఫెక్షన్ కూడా...

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (08:50 IST)
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి కోలుకున్న అనేకమంది ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇప్పటికే బ్లాక్ ఫంగ్, వైట్ స్కిన్ ఫంగస్, ఎల్లో ఫంగస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు హెర్పిస్ ఇన్ఫెక్షన్ కూడా చేరింది.
 
వైరస్ నుంచి కోలుకున్నాక ఇది తిరగబెడుతోంది. హెర్పిస్ ఇన్ఫెక్షన్ సోకడం వల్ల జట్టు రాలిపోవడం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు, పెదవి చుట్టూ పొక్కులు వంటివి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినవారు, క్వారంటైన్‌లో ఉన్నవారు ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
కొవిడ్ బాధితుల్లో ఎక్కువమంది హెర్పిస్ ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారని పేర్కొన్నారు. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్ఎస్‌వీ) వల్ల హెర్పిస్ లేబియాలిస్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఇది క్రమంగా హెచ్ఎస్‌వీ-1 లేదంటే హెచ్ఎస్‌వీ-2కు దారితీసే అవకాశం ఉంది. అదే జరిగితే పెదవి చుట్టూ నీటిపొక్కులు రావడంతోపాటు నొప్పి కూడా ఉంటుంది. కొవిడ్ బాధితుల్లో హెచ్ఎస్‌వీ కంటే హెర్పిస్ జోస్టర్ కేసులే ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
 
కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారిసెల్లా-జోస్టర్ వైరస్ మళ్లీ యాక్టివేట్ అయి హెర్పిస్ జోస్టర్ అనే ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది. ఫలితంగా చర్మంపై చెల్ది పొక్కులు వస్తాయని చెబుతున్నారు. అలాగే, క్యాండిడా ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల మర్మాయవవాల వద్ద తెల్లటి పొక్కులు వస్తుంటాయి. 
 
గోళ్లపై గోధుమ రంగులో గీతలు రావడం, మహిళల్లో జుట్టు రాలిపోవడం, నుదురు, వీపుపై మచ్చలు రావడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిలో ఏదైనా లక్షణం కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ARi: అరి చిత్రంలో భగవద్గీత సారాన్ని చెప్పా : దర్శకుడు వి. జయశంకర్

Deepika: దీపికా పదుకొనె, ఆలియా భట్ లు తెలుగు సినిమాల్లో చేయమంటున్నారు..

Nayanthara: నయనతార, సుందర్ సి కాంబినేషన్ లో మహాశక్తి

Balakrishna: బాలకృష్ణ కు అఖండ 2: తాండవం కలిసొత్తుందా !

Raj Tarun: ఈసారి చిరంజీవి ని నమ్ముకున్న రాజ్ తరుణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments