దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారికాగ గణనీయంగా తగ్గిపోయాయి. జూన్ 7వ తేదీన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ మేరకు.. గత 24 గంటల్లో 1,00,636 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.
ఆ ప్రకారంగా, ఆదివారం 1,74,399 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. మరో 2,427 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,49,186కు పెరిగింది.
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,71,59,180 మంది కోలుకున్నారు. 14,01,609 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 23,27,86,482 మందికి వ్యాక్సిన్లు వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 36,63,34,111 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఆదివారం 15,87,589 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.