Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిని రూ.80 వేలకు విక్రయించిన మామ... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (08:34 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మామ తన కోడలిని 80 వేల రూపాయలకు విక్రయించాడు. ఈ విషయం తెలిసిన భర్త.. పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బారాబంకీ జిల్లాలోని మల్లాపూర్‌కు చెందిన చంద్రరామ్ అనే వ్యక్తి గుజరాత్‌కు చెందిన ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని తన కోడలిని రూ.80 వేలకు విక్రయించాడు. 
 
ఈ విషయం తెలిసిన బాధితురాలి భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని బాధితురాలిని ముఠా చెర నుంచి విడిపించి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు అరెస్టు చేసిన 8 మంది నిందితుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడు, బాధితురాలి మామ చంద్రరామ్‌తోపాటు మరో నిందితుడైన రాము గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితురాలి మామ చంద్రరామ్ ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు పోలీసులు వెల్లడించారు. పలు వ్యసనాలకు బానిస అయిన చంద్రరామ్ డబ్బు కోసం కోడలిని అమ్మినట్టు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments