నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (08:27 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరు జిల్లా ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై వైద్యారోగ్య శాఖ సస్పెన్షన్ వేటువేసింది. ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో నిపుణులు చేసిన సిఫార్సుల మేరకే ప్రభుత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది.
 
జూన్‌ 5నే ప్రభాకర్‌ను కర్నూలు వైద్య కళాశాలకు బదిలీ చేస్తూ తాత్కాలిక చర్యలు తీసుకోగా తాజాగా సస్పెండ్‌ చేశారు. ఈ విచారణ సమయంలో నెల్లూరు విడిచి వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశించింది. 
 
ఆడియో రికార్డింగ్‌ ద్వారా బయటకు వచ్చిన వేధింపుల ఘటన 10 నెలల క్రితం జరిగినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆడియో టేపులు సామాజిక, ప్రసార మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం