Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రాన్స్‌లో జూలు విదుల్చిన కరోనా - కోటి దాటిన పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (09:58 IST)
ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా గత రెండు రోజులుగా ఈ వైరస్ జూలు విదిల్చింది. ఫలితంగా పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కోవిడ్ కేసుల సంఖ్య కోటి దాటిపోయింది. అలాగే, అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, రష్యా, భారత్ దేశాల్లో ఈ కేసుల సంఖ్య పది మిలియన్లను దాటిపోయిన విషయం తెల్సిందే. 
 
గత 24 గంటల్లో ఫ్రాన్స్‌లో 2,19,126 కేసులు నమోదయ్యాయి. అలాగే శుక్రవారం కూడా 2,23,200 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మరికొన్ని వారాల పాటు దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలను అమలు చేస్తుంది. ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అశ్విన్ పులిహార బాగా కలుపుతాడు - వెండితెర పై క్రికెటర్ కూడా : థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments