Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య భారతంలోకి అడుగుపెట్టిన కరోనా.. మణిపూర్‌లో తొలికేసు

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (10:58 IST)
ఈశాన్య భారతంలోకి కరోనా వైరస్ అడుగుపెట్టింది. ఫలితంగా మణిపూర్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. మణిపూర్‌కు చెందిన ఓ యువతి.. ఇటీవలే బ్రిటన్‌ నుంచి వచ్చింది. ఆ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. 
 
యువతి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ యువతి యూకేలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. ఇక ఇప్పటి వరకు భారత్‌లో 470 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిది మంది మరణించారు.
 
మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 500 దాటింది. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తంగా 37 మంది వైరస్ బారిన పడ్డారు. మరోవైపు మహారాష్ట్ర అత్యధికంగా ప్రభావితం అవుతోంది. దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 97 మందికి వైరస్‌ సోకింది. సోమవారం ఒక్క రోజే 23 కొత్త కేసులు వచ్చాయి. కేరళ 95 కేసులతో రెండో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments