Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సర్కారు దొంగ దెబ్బ... లీటరు పెట్రోల్‌పై రూ.18 పెంపు

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (10:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు మరోమారు దొంగదెబ్బ కొట్టింది. కోరనా వైరస్ కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు వీలుగా ఎన్డీఏ సర్కారు దొంగదెబ్బ కొట్టింది. 
 
ప్రత్యేక పరిస్థితుల్లో లీటరు పెట్రోల్‌పై రూ.18 వరకూ, డీజిల్‌పై రూ.12 వరకూ ఎక్సైజ్ సుంకాలను పెంచుకునేలా చట్ట సవరణ చేసింది. ఈ సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించగా, లోక్‌‌సభలో ఎటువంటి చర్చ జరగకుండానే ఆమోదం పొందినట్టు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ప్రకటించారు. 
 
ఇంతకుముందు పెట్రోల్‌‌పై రూ.10, డీజిల్‌‌పై రూ.4 వరకు మాత్రమే ఎక్సైజ్‌ సుంకం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి చట్ట పరంగా అవకాశం ఉండేది. ఇది ఇపుడు రూ.18, రూ.12కు పెంచుతూ చడీచప్పుడు లేకుండా చట్టసవరణ చేసింది. 
 
ఇటీవలికాలంలో నెలకొన్న అంతర్జాతీయ అనిశ్చితి క్రూడాయిల్ మార్కెట్‌ను కుదేలు చేశాయి. ఇప్పటికే బ్యారల్ ముడి చమురు ధర 30 డాలర్ల దిగువకు పడిపోయింది. చమురు ధరలు కనిష్ఠ స్థాయులకు చేరడంతో, కేంద్ర ఖజానాకు ఆదాయం తగ్గింది. దీంతో ఈ నెల 14న పెట్రోల్, డీజిల్ పై రూ.3 చొప్పున సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. 
 
ఈ చర్యతో రూ.39 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ఇదే సమయంలో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉండటంతో, భవిష్యత్తులోనూ ఎక్సైజ్ సుంకాలను పెంచుకునే వెసులుబాటు తమ వద్ద ఉంచుకునేందుకే కేంద్రం ఈ చట్ట సవరణను తెరపైకి తెచ్చిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments