Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోతే గుండెపోటు అని సర్టిఫికేట్ ఇచ్చారు, ఎక్కడ?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (11:00 IST)
ముంబైలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వ్యాధితో ఓ వ్యక్తి మరణిస్తే ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడని సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకుంది. ముంబైలోని కుర్లాలోని హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీరా విషయం బయటకు రావడంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. పప్పు ఖాన్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల కుర్లాలోని న్యూ నూర్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటుండగానే అతడు కరోనాతో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబం వద్ద డబ్బులు కట్టించుకొని గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ఇంటికి పంపించారు. 
 
అనుమానంతో వ్యాధి లక్షణాలను పరిశీలించగా అతనికి కరోనా అని తేలింది. దీంతో వైద్యులు సరిగా పరీక్షలు చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం బయటకు రాగానే మృతుని కుటుంబ సభ్యులు తాము ఉంటున్న ప్రాంతాన్ని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్లినట్టుగా సమాచారం.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments