కరోనా వైరస్.. రికార్డు స్థాయిలో మృతులు.. ఒకే రోజు 331 మంది మృతి

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (10:12 IST)
భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన అనంతరం దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. గతవారం రోజులుగా దేశంలో నిత్యం 9వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి.

గడచిన 24గంటల్లోనే అత్యధికంగా 9987 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్‌ ప్రవేశించిన అనంతరం ఒకేరోజు అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో కొవిడ్‌-19 మహమ్మారికి బలి అవుతున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. 
 
తాజాగా సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 331మంది మృత్యువాత పడ్డారు. ఒకే రోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం కూడా ఇదే తొలిసారి. మంగళవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 2,66,598కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

వీరిలో ఇప్పటివరకు 7466మంది మృత్యువాతపడ్డట్లు పేర్కొంది. మొత్తం బాధితుల్లో 1,29,215 మంది కోలుకోగా మరో 1,29,917 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments