Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 3, 2020 నాటికి కరోనా పారిపోతుందట.. నిజమేనా?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (13:33 IST)
కరోనా వైరస్ గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రపంచ దేశాలను అట్టుడికిస్తోంది. ఈ కరోనా వైరస్ డిసెంబరు 3 నాటికి కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నట్లు టైమ్‌ ఫ్యాక్ట్స్- ఇండియా ఔట్‌బ్రేక్‌ రిపోర్టు అంచనా వేసింది. సెప్టెంబరు తొలివారంలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య పతాక స్థాయిని చేరతాయని, ఆ తర్వాత క్రమక్రమంగా కరోనా బాధితుల సంఖ్య తగ్గిపోతుందని నివేదికలో వెల్లడించింది. 
 
కరోనా విజృంభిస్తున్న తొలినాళ్లలో హాట్‌స్పాట్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, చెన్నైలలో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడాన్ని సానుకూల అంశంగా పేర్కొంది. వాణిజ్య రాజధాని ముంబైలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య శిఖర స్థాయికి చేరుకుందని.. ప్రస్తుతం నమోదవుతున్న కేసులను గతంతో పోల్చి చూసినట్లయితే నవంబరు రెండో వారం నాటికి అక్కడ వైరస్‌ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
 
ఇక చెన్నైలో అక్టోబరు చివరినాటికి, ఢిల్లీలో నవంబరు మొదటి వారం, బెంగళూరులో నవంబరు రెండో వారంలోగా ఇలాంటి సానుకూల ఫలితాలే చూడవచ్చని అంచనా వేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో గత కొన్ని వారాలుగా కరోనా కేసుల సంఖ్య తగ్గముఖం పట్టడం శుభపరిణామమని పేర్కొంది. 
 
అలాగే ఆగష్టు 15 నాటికి రీప్రొడకక్షన్‌ రేటు మహారాష్ట్ర, తెలంగాణలో ఇది 1.24గా నమోదు కాగా.. రాజస్తాన్‌, ఢిల్లీలో ఆర్‌ వాల్యూ 1.06, 1.10గా ఉందని పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ నాటికి, తెలంగాణలో అక్టోబర్ 17 నాటికి కరోనా పూర్తిగా అంతం కావొచ్చని అంచనా వేసింది. 
 
ఇకపోతే.. భారత్‌లో గురువారం 68,898 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 29,05,823కు చేరింది. గడిచిన 24 గంటల్లో 983 మంది కోవిడ్‌తో మృతి చెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 54,849కు చేరింది. ఇక దేశంలో మహమ్మారి కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 21,58,946గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments