Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (11:09 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ప్రస్తుతం దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ మాత్రమే వ్యాక్సినేషన్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. 
 
అయితే ఈ రెండూ దేశీయంగా ఏర్పడిన డిమాండ్‌ తీర్చేలా కనిపించకపోవడంతో నిన్న మూడో వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చారు. తాజాగా అత్యవసర పరిస్థితుల మధ్య ఈ వ్యాక్సిన్‌ను వినియోగించ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
భారత్‌లో అత్యవసర పరిస్థితుల్లో తమ వ్యాక్సిన్‌ను వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఇదివరకే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీ సంస్థ దాఖలు చేసిన దరఖాస్తులపై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) ఆమోద ముద్ర తెలిపిన కొన్ని గంటల వ్యవధిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ తయారు చేస్తోంది. దీనికోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments