దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 21వేలకు పైగా చేరుకున్నాయి. అలాగే మహణాలు కూడా 1273గా ఉన్నాయి. ఈ మరణాల్లో 52 శాతం ఆ రెండు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హ. ముఖ్యంగా, మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులతో పాటు మరణాలు నమోదైన రాష్ట్రంగా నమోదైంది.
ఆ తర్వాత స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. బుధవారం దేశవ్యాప్తంగా 1,273 కొత్త కేసులు నమోదైతే.. అందులో 52 శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల నుంచే వచ్చాయి. అలాగే, బుధవారం 39 మంది చనిపోతే అందులో 79 శాతం మరణాలు ఈ రెండు రాష్ట్రాలవే. మహారాష్ట్రలో బుధవారం ఒక్క రోజే 18 మంది చనిపోతే.. గుజరాత్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, దేశంలో ఇప్పటిదాకా 21,355 కేసులు నమోదుకాగా, అందులో 48 శాతం మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ మూడు రాష్ట్రాలకు చెందినవి కావడం గమనార్హం. ఇక దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 683కి పెరిగింది. వీటిలో ఒక్క మహారాష్ట్ర నుంచే 269 మరణాలు సంభవించాయి. గుజరాత్‌లో 103 మంది మృతి చెందారు.
దేశంలో కరోనా మరణాల్లో 55 శాతం ఈ రెండు రాష్ట్రాలవే కావడం గమనార్హం. మన దేశంలో కరోనా సోకిన వారిలో ఇప్పటిదాకా 16 శాతం మంది కోలుకున్నారు. ఢిల్లీలో అత్యధికంగా 724 మంది కోలుకోగా తమిళనాడులో 662, రాజస్థాన్‌లో 344, కేరళలో 308 మంది ఈ వైరస్ నుంచి బయటపడ్డారు.