Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో శాంతించని కరోనా ఉద్రిక్తత, కొత్తగా 86,052 పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (12:13 IST)
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా మహమ్మరి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతున్నది. దీనికితోడు వివిద రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతున్నది. దేశంలో కేసుల సంఖ్య 58 లక్షల 18 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 86,052 కొత్త కేసులు నమోదు కాగా 1141 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 81,177 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 58,18,571 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,70,116 ఉండగా 47,56,164 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 92,290 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 81.74 శాతంగా ఉంది.
 
దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.59 శాతానికి తగ్గిన మరణాల రేటు. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 16.67 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,92,409 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఇప్పటివరకు దేశంలో 6,89,28,440 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments