Webdunia - Bharat's app for daily news and videos

Install App

COWAXIN Approval is Loading.. గుడ్ న్యూస్ కోసం వెయిటింగ్

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (20:10 IST)
కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించనుంది. కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే విషయాన్ని గత కొంతకాలంగా వాయిదా వేస్తూ డబ్ల్యూహెచ్‌వో ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది.. మరో 24 గంటల్లోగా కోవాగ్జిన్‌పై గుడ్‌న్యూస్‌ చెబుతాం అంటున్నారు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన మరింత డేటాను భారత్‌ బయోటెక్‌.. డబ్ల్యూహెచ్‌వోకి సమర్పించింది.
 
దీనిపై ఇవాళ డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా.. 24 గంటల్లో కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు గ్లోబల్ హెల్త్ బాడీ ప్రతినిధి మార్గరెట్ హారిస్. ఇంకా మార్గరెట్ మాట్లాడుతూ.. టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ప్రస్తుతం కరోనావైరస్ వ్యాధికి (కోవిడ్ -19) వ్యతిరేకంగా భారతదేశం దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ డేటాను సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు.
 
ఇక, అన్నీ సక్రమంగా ఉంటే.. అన్నీ సరిగ్గా జరిగితే, కమిటీ సంతృప్తి చెందితే, మేం రాబోయే 24 గంటలలోపు సిఫార్సును ఆశిస్తున్నామని హారిస్ చెప్పినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, ఇప్పటికే మిలియన్ల కొద్ది మంది భారతీయులు కోవాగ్జిన్‌ వేయించుకున్నారు.
 
కానీ, డబ్ల్యూహెచ్‌వో మాత్రం పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఏప్రిల్ 19 నాటికి అత్యవసర వినియోగ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చే ముందు కంపెనీ నుండి మరింత డేటా అవసరమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments